ఆ స్టార్ హీరోయిన్ మీద కోపంతో బాటిల్ పగలగొట్టా.. Rana సంచలన కామెంట్స్

by Disha Web Desk 7 |
ఆ స్టార్ హీరోయిన్ మీద కోపంతో బాటిల్ పగలగొట్టా.. Rana సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కన్ సల్మాన్ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు-24 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా, నాచురల్ స్టార్ నాని అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రానా.. దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రానా మాట్లాడుతూ.. ‘‘దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలు చేయడం చాలా సంతోషించకరమైన విషయం. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. దుల్కర్ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే.. ఓ సంఘటన గురించి చెప్పాలి. దుల్కర్ ఓ హిందీ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ మూవీ ప్రొడ్యూసర్స్ నా స్రేహితులే కావడంతో లోకేషన్‌కు వెళ్లాను. ఆ మూవీలో ఓ బాలీవుడ్ స్టార్ నటి హీరోయిన్‌గా చేస్తుంది. ఆమె టేక్ జరుగుతుండగా మధ్యలో వాళ్ల భర్తతో ఫోన్ మాట్లాడుతుంది. అది అర్జెంట్ విషయం కూడా కాదు. ఆయన లండన్‌లో షాపింగ్ చేస్తున్నాడట. ఆమె దాని గురించి మాట్లాడుతూ.. డైలాగ్స్ సరిగ్గా చెప్పడం లేదు. టేక్స్ మీద టేక్స్ తీశారు. దుల్కర్ మాత్రం కోపం తెచ్చుకోకుండా చాలా ఓపిగ్గా చేస్తున్నాడు. ఆమె తీరుకు నాకు మాత్రం చాలా కోపం వచ్చింది. దీంతో చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టా. ఆ హీరోయిన్ వెళ్లిపోయిన తర్వాత నిర్మాతలని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. కానీ, దుల్కర్ మాత్రం చాలా సహనంతో ఉన్నారు. అది దుల్కర్ వ్యక్తిత్వం’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Devaraతో OG పోటీ అంటే సాహసం అనే చెప్పాలి.. వైరల్ అవుతున్న Sri Reddy కామెంట్స్

Next Story

Most Viewed