Breaking : 19 ఏళ్లకే ‘దంగల్’ నటి మృతి

by Sathputhe Rajesh |
Breaking : 19 ఏళ్లకే ‘దంగల్’ నటి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2016లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘దంగల్’ మూవీలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన సుహానీ భట్నాగర్ (19) ఏళ్లకే కన్నుమూశారు. ఆ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగట్ పాత్రను సుహానీ పోషించారు. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు. ఫరీదాబాద్ లోని అజ్రోండాలోని సెక్టార్ 15లో గల స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆస్పత్రి వర్గాలు సుహానీ వాడుతున్న మందులు రియాక్షన్ కారణంగా ఆమె చనిపోయినట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed