ఆర్. నారాయణ మూర్తి 'యూనివర్సిటీ' టైటిల్ లోగో ఆవిష్కరించిన బ్రహ్మానందం!

by Disha Web Desk 17 |
ఆర్. నారాయణ మూర్తి యూనివర్సిటీ టైటిల్ లోగో ఆవిష్కరించిన బ్రహ్మానందం!
X

దిశ, సినిమా: ప్రముఖ ప్రజా దర్శకుడు, నిర్మాత, స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ వ్యవస్థాపకుడు ఆర్. నారాయణ మూర్తి తెరకెక్కించబోతున్న తాజా చిత్రం 'యూనివర్సిటీ'. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను తాజాగా బ్రహ్మానందం చేతుల మీదుగా విడుదల చేయించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారాయణమూర్తి.. 'నా 30వ సినిమా లోగోను బ్రహ్మానందం విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఎడ్యుకేషన్ మీద తీసిన ఈ చిత్రానికి సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణ తో పాటు మిగతా వారందరికీ ధన్యవాదాలు. వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఇందులో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్రాన్ని తెరకెక్కించాను. విద్య ప్రైవేట్‌పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయబోమని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నా' అన్నారు.

అలాగే బ్రహ్మీ మాట్లాడుతూ.. 'సినిమానే ఆయనకు ప్రాణం. నారాయణ అరుదైన వ్యక్తి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడే మనిషి. ఎడ్యుకేషన్ మాఫియా కథాంశంతో వస్తున్న చిత్రం చూస్తే విద్యా వ్యవస్థలో లోపాలు అర్థమవుతాయి' అన్నారు.


Next Story