- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Brahmamudi : నేను నీ కోసం ఏం చేయలేనంటూ .. అనామికతో డైరెక్ట్ గా చెప్పిన కళ్యాణ్

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
ఆరోపణలకు చేయడానికి కూడా ఓ అర్థం ఉండాలి. అలాగే నిందలు కారణాలు ఉండాలి. వాళ్ల గురించి నీకేం తెలుసని నీకు మా అన్నా వదినలను బెదిరించి మాట్లాడుతున్నావ్? నీకేం అర్హత ఉందని పెద్దల ముందు నీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావ్ నాకొక్కటి చెప్పు.. నేను ఒక బిజినెస్ మెన్‌గా తెలుసా? లేక కవిగా తెలుసా? నా కవితలను ప్రేమించా అన్నావ్.. ఇదేనా నీ ప్రేమ .. ఈ రోజు ఆఫీసులో అంత రచ్చ చేసావ్ .. నీకు నా మీద ప్రేమ ఉందా అసలు? కవులను గౌరవిస్తాను అన్నావ్. ఇదేనా ప్రేమా, గౌరవం? ఎంతసేపటికి నీ గోల నీదేనా .. నా ఇష్టాలను తెలుసుకోవా ? నా అయిష్టాలు అడగవా ? నా భావకవిత్వం తెలుసా? అని అనామికకు నిలదీసి అడుగుతాడు.
కవి మాట్లాడుతూనే ఉంటాడు.. నీకు చాలా సార్లు చెప్పా .. నాకు ఆఫీస్‌కి వెళ్లడం ఇష్టం లేదు. కానీ నీకోసం బలవంతంగా వెళ్లాను.. ఎందుకంటే నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదు. నేను మా అన్నయ్యాలా బిజెనెస్ చేయలేను. అలా అని నేను పనికి రాకుండా పోను.. నేను అసమర్థుని అయిపోను. నేను ఏం చేయగలనో ? ఏమి చేయలేనో బాగా తెలుసు.. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు .. ఇప్పుడు నేను చెప్పేది కూడా విను ..అనామికా.. నేను నీకోసం ఏమి చెయ్యలేను.. నేను నా లాగే ఉంటా .. నాకు ఏమి చేయాలనిపిస్తే.. అదే చేస్తా .. కవిగా మాత్రమే బతుకుతాను. దట్స్ ఆల్’ అంటూ గట్టిగా అరిచి చెబుతాడు కళ్యాణ్. వెంటనే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.