తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా సఫర్ అవుతున్న బాయ్స్.. అమ్మాయిలకంటే ఎక్కువే..

by Disha Web Desk 10 |
తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా సఫర్ అవుతున్న బాయ్స్.. అమ్మాయిలకంటే ఎక్కువే..
X

దిశ, ఫీచర్స్ : తల్లిదండ్రుల మరణం కూతుళ్లు, కొడుకులకు అత్యంత బాధాకరమైన అంశంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తర్వాతి జీవితంలో ఈ పరిస్థితి అమ్మాయిలకంటే కూడా, 21 ఏళ్లలోపు వయస్సు కలిగిన అబ్బాయిలనే ఎక్కువగా వేధిస్తుందని, దీంతో అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటారని ఒక అధ్యయనం పేర్కొన్నది. స్టడీలో భాగంగా ఫిన్‌లాండ్‌‌కు చెందిన పరిశోధకులు 2016 సంవత్సరంలో 30 ఏళ్ల వయస్సు గల దాదాపు 10 లక్షల మంది గర్ల్స్‌ అండ్ బాయ్స్ డేటాను విశ్లేషించారు. వీరిలో దాదాపు 1, 45,673 మంది 31 ఏళ్లు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయినవారు ఉన్నారు.

పేరెంట్స్ లేకపోవడంతో భవిష్యత్తుకు సంబంధించిన అనేక అనుమానాలు, ఆలోచనలు గర్ల్స్ కంటే బాయ్స్‌నే ఎక్కువగా ఒత్తిడికి గురిచేశాయని, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యాయని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా అబ్బాయిలు తక్కువ సంవత్సరాలు అధికారిక విద్యను, తక్కువ ఆదాయాన్ని పొందడం, 26 నుంచి 30 సంవత్సరాల మధ్య ఎక్కువ మంది నిరుద్యోగ సమస్యతో బాధపడటం వంటి సవాళ్లను ఎదుర్కొన్నట్లు గుర్తించారు. ఇక ఆడవారితో పోలిస్తే మగవారి వార్షిక సంపాదనలో పెద్ద తగ్గింపు వారి తండ్రి ముందస్తు మరణంతో ముడిపడి ఉన్నట్లు కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఇక తల్లిదండ్రులిద్దరి మరణంతో పురుషులు తమ వార్షిక సంపాదనలో 16.4 శాతం క్షీణతను చవిచూడగా, మహిళలు 10.9 శాతం తగ్గుదలని చవిచూసినట్లు రీసెర్చర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా 21 ఏళ్లలోపు తల్లిదండ్రులను కోల్పోయిన స్త్రీలతో పోలిస్తే, పురుషులలో ఉపాధిరేటు 6.1 శాతం తగ్గుదలకు దారితీసినట్లు వెల్లడించారు.

Next Story