రామ్ చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ టైగర్..! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

by Disha Web Desk 7 |
రామ్ చరణ్‌కు విలన్‌గా బాలీవుడ్ టైగర్..! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం.. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రామ్ చరణ్. ఈ విషయాన్ని చరణ్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ సినిమాను బుచ్చిబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నాడట.

దీంతో హీరోయిన్ దగ్గర నుంచి విలన్ వరకు స్టార్స్‌ను మాత్రమే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే విలన్ క్యారెక్టర్‌కు బాలీవుడ్ స్టైలిష్ అండ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్‌ను దించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇదే కనుక నిజం అయితే.. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కన్నా టైగర్ ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్‌ విలన్‌గా అతడు వద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story