- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొడుకు కోసం నగ్నంగా అలాంటి పని చేసిన బాలీవుడ్ బాద్‌షా.. పోస్ట్ వైరల్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఇటీవల వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బాక్సాఫీసును షేక్ చేస్తూ బాద్షా అని మరోసారి నిరూపించుకున్నాడు. పఠాన్, జవాన్, డంకీ, సినిమాతో హిట్స్ అందుకున్నాడు.
అంతేకాకుండా ఈ మూవీస్ కోట్లలో కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అయితే షారుఖ్ ఖాన్ సినిమాలతో పాటు యాడ్స్, పలు బిజినెస్‌లు చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నాడు. తాజాగా, షారుఖ్ ఖాన్, తన కొడుకు ఆర్యన్ కోసం ప్రమోషన్ చేశాడు. ఒంటిపై బట్టలు లేకుండా, మందు గ్లాస్ చేతపట్టి ఫొటో షేర్ చేయడంతో పాటు కొడుకు దుస్తుల బ్రాండ్‌ను ట్యాగ్ చేశాడు.
ప్రస్తుతం షారుఖ్ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కాగా, ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ కేసు కొద్ది రోజుల పాటు కొనసాగింది. మొత్తానికి ఆర్యన్ బయటపడ్డాడు. ఆ తర్వాత కొద్ది కాలం అన్నింటికీ దూరంగా ఉన్నాడు. ఒక కొద్ది రోజుల నుంచి యాక్టీవ్‌గా ఉంటూ సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి సత్తా చాటుతున్నాడు. బ్రాండెడ్ బట్టలు అందుబాటులోకి తీసుకువస్తూ.. సరికొత్తగా బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.