బాలీవుడ్ హీరోలు బాలయ్యను చూసి నేర్చుకోవాలి.. పాయల్ ఆసక్తికర పోస్ట్

by Disha Web Desk 6 |
బాలీవుడ్ హీరోలు బాలయ్యను చూసి నేర్చుకోవాలి.. పాయల్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ చిత్రంలో తమన్నా ఫ్రెండ్‌గా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. గత కొద్ది కాలంగా పూర్తిగా సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా, పాయల్ బాలీవుడ్ హీరోలను ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేసింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యపై ప్రశంసలు కురిపించింది.

అన్ స్టాపబుల్ షోతో పాటు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. 63 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, నేటి తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని పాయల్ ప్రస్తావిస్తూ బాలీవుడ్ యాక్టర్స్‌కు చురకలు అటించింది. ‘‘అందరూ బాలయ్య ని చూసి నేర్చుకోవాలి. ఈ బాలకృష్ణ సార్ ఈ ఏజ్‌లో కూడా సూపర్ హిట్స్ కొడుతున్నారు. బాలీవుడ్ నటులు ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాలి’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed