ఏదో అవుదామనుకుంటే.. ఇంకేదో అయింది.. పర్సనల్ లైఫ్‌పై ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్

by Dishafeatures2 |
ఏదో అవుదామనుకుంటే.. ఇంకేదో అయింది.. పర్సనల్ లైఫ్‌పై ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : అనుకున్నవి జరగవుకొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అంటుంటారు. చాలా మంది తమ జీవితంలో ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటూ ఉంటారు. పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా కొన్నిసార్లు ఏదో చేద్దామని ముందడుగు వేస్తారు. ఆ తర్వాత పరస్థితులు సహకరించకనో, అవకాశాలు కలిసి రాకనో ఇంకేదో చేస్తుంటారు. సరిగ్గా అలాంటి అనుభవమే తాను ఎదుర్కొన్నాను అంటోంది ప్రముఖ స్టార్ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా?.. బాలీవుడ్ భామ కరీనా కపూర్.

వాస్తవానికి సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారు అదే రంగంలో ప్రవేశించడం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. అంత మాత్రానా సక్సెస్ అందుకుంటారని గ్యారెంటీ లేదు. చాలా మంది విషయంలో ఇది రుజువైంది. కానీ కొందరి విషయంలో మాత్రం అందుకు భిన్నంగానూ జరిగింది. పేరెంట్స్ సినీ బ్యాగ్రౌండ్ వల్ల పరిశ్రమలో అడుగు పెట్టి సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు. ఫ్యామిలీ సపోర్ట్‌తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేకశించిన ఈ అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ వైపు దూసుకెళ్లిందనే చెప్పాలి. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న కరీనా తన సినీ కెరీర్ అనుభవాలను పంచుకున్నది.

‘‘నేను సినీ కుటుంబంలో పుట్టాను. షూటింగ్ సెట్స్ చూస్తూ పెరిగాను. కానీ అది నాకు తెలిసిన ఫీల్డే కదా అనే భావన ఉండేది. అందుకని నేను ఈ రంగంలో ప్రవేశించాలనుకోలేదు. వాస్తవానికి క్రిమినల్ లాయర్ అవ్వాలనుకున్న. కానీ నా అభిప్రాయం విని మా కుటుంబంలో అందరూ నవ్వారు. అటువైపు ప్రోత్సహించలేదు కూడా. లాయర్ అవ్వడం కంటే యాక్టర్ అవ్వడం నీకు ఈజీ అవుతుందని చెప్పారు. తర్వాత నాకూ అలాగే అనిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది. లాయర్ అవ్వాల్సిన నేను అనుకోకుండా యాక్టర్ అయ్యాను. పరిస్థితులు అలా మార్చేశాయి’’ అంటూ చెప్పుకొచ్చింది కరీన.. ప్రజెంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో క్యూరియా సిటీని పెంచుతున్నాయి.

Next Story

Most Viewed