బాడిషెమింగ్ చేసిన నెటిజన్లు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటి వీడియో వైరల్

by Kavitha |
బాడిషెమింగ్ చేసిన నెటిజన్లు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటి వీడియో వైరల్
X

దిశ, సినిమా: బిగ్ బాస్ షో తో ఫేమ్ తెచ్చుకున్న వారిలో శ్వేతా వర్మ ఒకరు. ముందు కొన్ని చిత్రాల్లో నటించిన ఈ చిన్నది బిగ్ బాస్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రజంట్ ఆమె ఓ డ్యాన్సింగ్ షోలో కనిపించనుంది. అయితే శ్వేతా వర్మ ప్రస్తుతం కాస్త లావైంది. దీంతో ఆమె మీద బాడీ షేమింగ్ జరుగుతోంది. దీంతో తాజాగా ఈ ట్రోలింగ్‌పై శ్వేతా వర్మ మండిపడింది.. ‘ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చేస్తు.. నా సంపాదన నేను చూసుకుంటున్న. మీరు లావుగా ఉన్నారు.. అలా ఉన్నారు.. ఇలా అయ్యారు అని నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. మీరేం నను పోషించడం లేదు.

అమ్మాయిలు ఎలా ఉండాలనేది కూడా మీరే చెబుతారా? అదే ఓ హీరోనో, ఇతర మేల్ ఆర్టిస్ట్ ఎలా ఉన్నా కూడా పట్టించుకోరు. వారు లావైనా ఏమీ అనరు.. కానీ ఆడవాళ్లు మాత్రం ఇలానే ఉండాలని అంటారు. మీ పని మీరు చూసుకోండి.. నేను ఎలా ఉంటే మీకేంటి’ అంటూ శ్వేతా వర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్వేతా వర్మ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story