స్టార్ కిడ్ వల్ల చేదు అనుభవం.. అది సరైన పద్దతి కాదంటూ మృణాల్ ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)

by Disha Web Desk 6 |
స్టార్ కిడ్ వల్ల చేదు అనుభవం.. అది సరైన పద్దతి కాదంటూ మృణాల్ ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదట హిందీ సీరియల్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత సీతారామం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదట చిత్రంలో మొత్తం చీరలో సంప్రదాయ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసింది. ఇక ఈ మూవీ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి రెప్సాన్స్‌ను సొంతం చేసుకుంది. ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఒక్క సినిమాతోనూ మృణాల్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయేలా పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండి తన హాట్ ఫొటోలు షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

సంప్రదాయ లుక్స్ చూసిన నెటిజన్లు మోడ్రన్‌గా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో ఆమెపై ట్రోల్స్ కూడా చేశారు. అయినప్పటికీ వాటిపై ఈ అమ్మడు స్పందించకుండా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల మృణాల్, నాని సరసన హాయ్ నాన్నలో నటించి మెప్పించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్స్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఓ అవార్డ్ ఫంక్షన్‌లో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని నెపోటిజంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘కొందరు మీడియా వారు నన్ను ఇంటర్వ్యూ చేస్తుండగా అక్కడికి ఓ స్టార్ కిడ్‌తో పాటు జాన్వీ వచ్చింది. దాంతో అంతా నన్ను వదిలేసి ఆమె దగ్గరకు వెళ్లిపోయారు.

ఆమె నార్మల్‌గా వచ్చినందుకే అలా చేశారంటే అవార్డ్ వస్తే నా ఇంటర్వ్యూ కూడా తీసుకునేవారు కాదు. అందులో ఆమె తప్పు ఏం లేదు. నెపోటిజం పేరుతో స్టార్‌లను ఎందుకు నిందిస్తుంటారో నాకు అర్థం కాదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. అసూయతో ఈ మాటలు చెప్పడం లేదు. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారిని దృష్టిలో ఉంచుకుని చెప్తున్నాను. సాధారణ ప్రజలకు స్టార్స్ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే మీడియా వారిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుందని అర్థమైంది’’ అని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story

Most Viewed