తిరుపతి మెట్ల దారిలో మా మీద చిరుత దాడి చేసిందంటూ.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ప్రియాంక

by Hamsa |
తిరుపతి మెట్ల దారిలో మా మీద చిరుత దాడి చేసిందంటూ.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ప్రియాంక
X

దిశ, సినిమా: బుల్లితెర నటి ప్రియాంక జైన్- శివ కుమార్ మౌనరాగం సీరియల్‌లో నటించి అప్పుడే ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరు అప్పటినుంచి తమ రిలేషన్ కొనసాగిస్తూనే కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే శివ కుమార్ పలు సీరియల్స్ ఈవెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక విషయానికి వస్తే.. ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 షోలో పాల్గొని తన పాపులారిటీ పెంచుకుంది. అంతేకాకుండా తన ఆటతీరుతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. టాప్ 5లిస్ట్ చేరింది కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఏ సీరియల్ ఒప్పుకోకుండా పలు షోస్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా, ప్రియాంక తన ప్రియుడు శివ కుమార్‌తో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్ళింది. సాయంత్రం వేళలో మెట్ల దారిపై నడుచుకుంటూ వెంకన్న దర్శనం చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే మెట్లు ఎక్కుతుండగా మధ్యలో చిరుత కనిపించింది. దీంతో వీరిద్దరు పరుగులు పెట్టారు. అంతేకాకుండా భయపడిపోయి కేకలు కూడా వేశారు. ఆ తర్వాత గట్టిగా ఒకరినొకరు పట్టుకొని చీత నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఓ చోట ఆగి ప్రియాంకను శివ నువ్వు అందరినీ భయపెట్టడానికి వచ్చావా అని అంటాడు. అప్పుడు లేదు.. నువ్వే భయపెట్టావు అని అంటుంది. దీంతో శివ నేను ఏదో చూసి అంటే.. చీతా అని రన్నింగ్ చేస్తావా అని అన్నాడు. ఇక అప్పుడు దూరంగా ఉన్న కారు హెడ్ లైట్స్ నాకు దూరం నుంచి చీతా కళ్లలాగే అనిపించాయి. అందుకే చిరుత అనుకుని భయపడిపోయాను దీంతో పరుగులు పెట్టాను అని చెప్పింది.

ఆ తర్వాత దేవుడిని దర్శించుకుని ఓ హోటల్‌కు వెళ్లి మ్యాగి తినేసి వెళతారు. అంతా వీడియో తీసి ఈ జంట యూట్యూబ్ చానల్ ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాకుండా దానికి మా మీద చీతా దాడి చేసిందనే థంబ్‌నెయిల్ పెట్టారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు బాగుంది మీ పెళ్లి కూడా అక్కడే జరగాలని కోరుకుంటున్నాము అని అంటున్నారు. మరికొందరు మాత్రం ‘‘ఫస్ట్ మీరు థంబునైల్ మార్చండి తిరుమల వెళ్ళే భక్తులకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ తిరుపతి వెళ్లే భక్తులను భయాందోళన గురి చేయకండి నీకేమన్నా చేతనైతే మంచి వీడియోలు పెట్టండి భక్తితో అంతేకానీ భయాందోళన గురి చేసే వీడియోలు పెట్టకండి దయచేసి’’ అని కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed