అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ‘పుష్ప 2’ నుంచి బిగ్ అప్‌డేట్ (పోస్ట్)

by Disha Web Desk 7 |
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్.. ‘పుష్ప 2’ నుంచి బిగ్ అప్‌డేట్ (పోస్ట్)
X

దిశ, సినిమా: ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ ‘పుష్ప2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషర్‌లో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఇటీవల వచ్చిన ‘పుష్ప2’ టీజర్‌కు నెట్టింట విశేష స్పందన లభించింది.

కేవలం ఒక్కనిమిషం ఉన్న ఈ టీజర్.. మోస్ట్ ట్రెండింగ్ వన్‌గా నిలవడం విశేషం. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ‘పుష్ప2’ మూవీ టీం సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో రిలీజ్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘రేపు సాయంత్రం 04:05 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో’ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.



Next Story

Most Viewed