రజినీకాంత్‌కు బిగ్ షాక్.. అక్కడ ‘లాల్ సలాం’ రిలీజ్‌పై సస్పెన్స్.!

by sudharani |
రజినీకాంత్‌కు బిగ్ షాక్.. అక్కడ ‘లాల్ సలాం’ రిలీజ్‌పై సస్పెన్స్.!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, టీజర్‌కు మంచి రెన్పాన్స్ రాగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల చేత వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.

అందుతున్న సమాచారం మేరకు.. ‘లాల్ సలామ్’ సినిమాను కువైట్‌లో బ్యాన్ చేశారట. ఎందుకంటే కువైట్, కథర్ దేశాలు సినిమాల రిలీజ్‌పై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయట. చిత్రంలోని కంటెంట్ ఏమాత్రం తేడాగా ఉన్న సినిమా రిలీజ్‌ను ఆపివేస్తారట. ఈ క్రమంలోనే లాల్ సలామ్ సినిమాలో హిందూ, ముస్లిం ఘర్ణణలకు సంబంధించి సెన్సిటివ్ కాన్సెప్ట్ ఉందని ఈ చిత్రాన్ని అక్కడ బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే.. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ‘లాల్ సలామ్’ మూవీపై ఆ దేశంలో సస్పెన్స్ ఉండటంతో రజినీకాంత్ ఫ్యాన్స్ సందిగ్ధంలో పడ్డారు.

Read More..

రామ్ చరణ్-శ్రియా ఒకే స్కూల్‌లో, కలిసి యాక్టింగ్ నేర్చుకున్న వీడియో వైరల్

Next Story

Most Viewed