హీరోయిన్లుగా గుర్తింపు పొందిన మిస్ ఇండియాలు.. ఎంతమంది ఉన్నారో తెలుసా?

by sudharani |
హీరోయిన్లుగా గుర్తింపు పొందిన మిస్ ఇండియాలు.. ఎంతమంది ఉన్నారో తెలుసా?
X

దిశ, సినిమా: అందం, కాన్ఫిడెన్స్, టాలెంట్ ఈ మూడు పరీక్షల్లో నెగ్గి మిస్ ఇండియాగా అవతరించడం మాములు విషయం కాదు. మరి మన తెలుగు సినిమాల్లో నటించి మిస్ ఇండియాగా ఎదిగిన వారు ఎంతమందున్నారో చూద్దాం. 1984లో మిస్ ఇండియా అవార్డు గెలిచుకున్న Juhi Chawla.. కింగ్ నాగార్జునతో ‘విక్కీ దాదా’లో నటించింది. 1993లో నమ్రత.. మహేష్ బాబుతో ‘వంశీ’, చిరంజీవితో ‘అంజి’ సినిమాలు చేసింది. 1994లో సుస్మితాసేన్.. నాగార్జునతో ‘రక్షకుడు’లో నటించింది. 2001లో సెలీనా జైట్లీ హీరో మంచు విష్ణుతో ‘సూర్యం’ చిత్రంలో నటించింది. 2002 నేహా ధూపియా సీనియర్ హీరో రాజశేఖర్‌తో కలిసి ‘విలన్’ మూవీలో యాక్ట్ చేసింది. ఇక 2004 తను శ్రీ దత్తా.. బాలయ్య బాబుతో ‘వీరభద్ర’లో పనిచేసింది. ఇక 1994లో సుస్మితాసేన్ విన్నర్ అయితే.. రన్నర్‌గా ఐశ్వర్య రాయ్ నిలివడం విశేషం.

Next Story