కరోనా వల్ల ఇంటికే పరిమితమైన బ్యూటీ..ప్రజెంట్ ఓటీటీ స్టార్!

by Jakkula Mamatha |   ( Updated:2024-02-15 12:01:01.0  )
కరోనా వల్ల ఇంటికే పరిమితమైన బ్యూటీ..ప్రజెంట్ ఓటీటీ స్టార్!
X

దిశ, వెబ్ డెస్క్:ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు.వచ్చిన మంచి మంచి అవకాశాలు కోల్పోయిన, మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి తమ లైఫ్ మొదలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు అదే బాటలో నడుస్తుంది. ఓటీటీ స్టార్, బాలీవుడ్ నటి ఆరుషి శర్మ. ఈ నటి బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించకుంది. అయితే ఆ సినిమాల తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్‌లో ఇంతియా రాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన తమాషా మూవీలో సీతా దేవి గా చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత ఈ నటి ‘లవ్ ఆజ్ కల్’ లో లీడ్ రోల్ నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తర్వాత ఈ భామకు వరుసగా ఆఫర్లు క్యూ కడతాయి అనుకునేలోపు.. కరోనా తన లైఫ్‌ను టర్న్ చేసింది. కరోనా విజృంభించడం, లాక్ డౌన్ కారణంగా ఆరుషి సినిమా అవకాశాలు రాలేదు. ఇక అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ఇంటికే పరిమితమైంది. నాకు మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నా, కానీ కరోనా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా కుదేళ్లైంది. దీంతో ఎలాంటి అవకాశాలు లేక ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డాను.

కానీ కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు మంచి ఆదరణ లభించింది. అలా నాకు కూడా అవకాశం తలుపు తట్టింది. జాదుగర్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెటిఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. తనదైన స్టైల్ లో మూవీస్ చేస్తు మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తను ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటానని చెప్పింది.

Next Story