పైకి నవ్వుతూ కనిపిస్తే ఆనందంగా ఉన్నట్లు కాదు: కృతిసనన్

by Aamani |
పైకి నవ్వుతూ కనిపిస్తే ఆనందంగా ఉన్నట్లు కాదు: కృతిసనన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రజంట్ ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

‘పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రానా ఆనందంగా ఉన్నట్లు కాదు. లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా.. బయట పడకూడదు. కానీ కొన్నిసార్లు మునుపటి గాయలకు గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఒకప్పుడు ఆలోచించకుండా అన్ని కావలనుకున్నా. ఈ పాటికే భారీ ప్రాజెక్టుల్లో నేను ఉండాల్సింది కదా.. తక్కువ అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? అసలు నేను ఎప్పుడు ఎదుగుతాను? అంటూ రెస్ట్ లెస్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ, నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూశాకా.. నా ఎదుగుదల ఏంటో నాకు అర్థమైంది. ఒక క్లారిటీ వచ్చింది. ప్రజంట్ నేను మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed