- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలంటే దమ్ము కావాలంటూ.. ఆ హీరోకు ఇచ్చిపడేసిన బండ్ల గణేష్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కె-ర్యాంప్’(K-Ramp) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న బండ్ల గణేష్ (Bandla Ganesh)షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఆస్తినీ, అంతస్తునూ వారసత్వంగా ఇవ్వొచ్చు. తెలివినీ, సక్సెస్ ను ఎవ్వడూ వారసత్వంగా ఇవ్వలేడు! వేయి కోట్లు ఇస్తాను ‘గబ్బర్ సింగ్’ ఇవ్వండి నాకు. దమ్ము కావాలి.. దేవుడి దయ కావాలి. మన కష్టం కావాలి..నిజాయితీ కావాలి. సినిమా అంటే ప్రేమ కావాలి! ప్రేమతో, కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ వస్తది.
అంతేకానీ వాట్స్ అప్ అంటే రాదు హిట్టు’’ అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ బండ్ల గణేష్ ఓ టాలీవుడ్ హీరోను ఉద్దేశించి అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా బండ్ల గణేష్ రౌడీ విజయ్ దేవరకొండ గురించే అన్నారని పలు చర్చలు మొదలయ్యాయి. కాగా కిరణ్ అబ్బవరం, జైన్స్ నాని కాంబోలో వచ్చిన ‘కె-ర్యాంప్’ బాక్సాఫీసు వద్ద మెప్పించింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుదాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మించారు.
READ MORE ....






