బాలయ్య ఆశీర్వదిస్తే.. చిరు కౌగిలించుకున్నాడు.. ఇద్దరి మధ్య తేడా ఇదే!

by Anjali |
బాలయ్య ఆశీర్వదిస్తే.. చిరు కౌగిలించుకున్నాడు.. ఇద్దరి మధ్య తేడా ఇదే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఎప్పుడు ముందు స్థానంలో ఉండే హీరోలు బాలకృష్ణ, చిరంజీవి. వీరిద్దరు వయసు మీదపడుతున్న అగ్ర హీరోలుగా కొనసాగుతూనే యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హీరోల సినిమాలకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరగుతోంది. అయితే తాజాగా చిరు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది. ‘భోళా శంకర్’ మూవీ ఈవెంట్ చిరంజీవి, కీర్తి సురేష్‌ను కౌగిలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మీద మిమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అయితే తాజాగా జరిగిన ‘స్కంద’ ఈవెంట్‌లో బాలయ్య శ్రీ లీలను ఆశీర్వదించాడు. దీంతో చిరు, బాలయ్య ఫొటోలు పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య మధ్య తేడా ఇదేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: ఇప్పటివరకు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో!

Next Story

Most Viewed