- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మెగాస్టార్ రిజెక్ట్ చేసిన కథతో భారీ హిట్ కొట్టిన బాలయ్య.. ఆ సినిమా ఏంటంటే..?

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో ఒకరికి అని రాసుకున్న స్క్రిప్ట్ మరో హీరో లేదా హీరోయిన్ చెయ్యడం చాలా కామన్. ఇలా వదిలేసుకున్న మూవీస్ కొన్ని సార్లు అట్టర్ ప్లాప్ అవుతాయి. ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాయి. అయితే.. మూవీ హిట్ అయినట్లుయితే హీరోహీరోయిన్లు అనవసరంగా వదులుకున్నాం అని కూడా ఫీల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పి నట సింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కూడా ఒకటి ఉందట. అదేంటో తెలుసుకుందాం...
నందమూరి బాలకష్ణ హీరోగా, బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నరసింహ నాయుడు’. 2001 లో రిలీజైన ఈ మూవీ మంచి సక్సెస్‌ను అందుకుంది. అయితే.. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ మెగా స్టార్ చిరంజీవికి అనుకున్నారట. ఈ విషయాన్ని రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్‌కు చెప్పి కథ కూడా వినిపించారట. ఇది నాకు సెట్ అవదు అంటూ చిరంజీవి రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలోనే చిన్ని కృష్ణ ఈ కథను డైరెక్టర్ బి గోపాల్ సహాయంతో బాలకృష్ణకు వినిపించగా ఆయన ఒకే అనడమే కాకుండా.. ఈ మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు నటసింహం. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.