నేను, బాలయ్య గారు కలిసి షూట్‌లో ఆ పని చేశాం.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్

by Kavitha |
నేను, బాలయ్య గారు కలిసి షూట్‌లో ఆ పని చేశాం.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కలర్ ఫోటో సినిమాతో పరిచయమైన చాందిని చౌదరి అందరికీ సుపరిచితమే. ఆ మూవీ లోని ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో లీడ్ రోల్స్ లో దూసుకుపోతుంది. త్వరలో బాలకృష్ణ సినిమాలో కూడా కనిపించబోతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ NBK 109 సినిమాలో చాందిని చౌదరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైం లో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు విషెస్ తెలిపింది చాందిని.

అలాగే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి NBK 109 సినిమా గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. సినిమా ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ అయిపోయింది. ఇందులో నేను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉంటుంది నా పాత్ర. స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. కథలో నాది చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర. సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు. సెట్ లో మేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ చేసేవాళ్ళం సరదాగా. షాట్ ఉన్నా లేకపోయినా బాలయ్య గారు సెట్ లోనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరితో ఈజీగా కలిసిపోతారు ఆయన అని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed