ఏడాది పూర్తి చేసుకున్న ‘బలగం’ మూవీ.. వేణు ఎమోషనల్ పోస్ట్

by sudharani |   ( Updated:2024-03-05 16:41:42.0  )
ఏడాది పూర్తి చేసుకున్న ‘బలగం’ మూవీ.. వేణు ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న వారిలో వేణు ఒకరు. ఆయన కామెడీ పంచులతో, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కూడా రానిస్తున్నాడు. ఈ క్రమంలోనే వేణు ‘బలగం’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తెలంగాణ కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దా భారీ హిట్ అందుకుని దాదారు రూ. 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది.

ఈ మూవీలో ఉన్న బంధాలు, భావోద్వేగాలు ప్రతి మనిషి అర్థం చేసుకోవాలని ఈ చిత్రాన్ని పళ్లేటూరులో తెరలు కట్టి మరీ ప్రదశ్శించారు. అంత సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ వేణు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘బలగం సినిమాను ఇంత ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో.. వేణుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed