ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు..? అసలు విషయం ఇదే..!

by Dishafeatures2 |
ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు..? అసలు విషయం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ మూవీతో ఈ యంగ్ రెబల్ స్టార్ కోట్లాది మందికి ఫేవరేట్ హీరో అయ్యాడు. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా క్షణాల్లో వైరల్ అవుతుంది. అది ఆయనకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక విషయానికొస్తే తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో వచ్చిన ఈ ఫోటో కు ‘‘ప్రభాస్ కు ఏమైంది? చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ హీరో శివకుమార్ లతో ప్రభాస్ దిగిన ఫోటో ప్రభాస్ ఫ్యాన్స్ కు విపరీతమైన కోపాన్ని తెప్పించింది.

వారి కోపానికి అసలు కారణమేంటంటే?.. ఆ ఫోటోలో ప్రభాస్ పూర్తిగా గుర్తు పట్టలేనంతగా తయారయ్యాడు. బాడీ షేపవుట్ అయినట్లు కనిపిస్తున్నాడు. బాడీ చిన్నగా.. తల పెద్దదిగా చూడ్డానికి కొంచెం వికారంగా ఉన్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో కాదని, మార్ఫింగ్ చేశారని గమనిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. మరి రజినీకాంత్, శివకుమార్ ల మధ్యకు ప్రభాస్ ఎలా వచ్చారంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జైలర్ అనే మూవీ వస్తోంది. ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివకుమార్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. వాళ్లిద్దరూ షూటింగ్ స్పాట్ లో కలిసిన ఓ ఫోటోను ఎవరో మార్ఫింగ్ చేసి వారి మధ్యల ప్రభాస్ ను పెట్టారు. ఇదీ అసలు సంగతి.

Next Story