మళ్లీ కెమెరా ముందుకు అందాల చందమామ!

by Disha WebDesk |
మళ్లీ కెమెరా ముందుకు అందాల చందమామ!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా.. తాను గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''ఆత్రుత, ఉత్సాహంగా నేను ప్రసవానంతర 4 నెలల తర్వాత తిరిగి ఫిటెనెస్ ప్రారంభిస్తున్నాను. నా బిడ్డ, నేను శారీరక శ్రమను చాలా ఎక్కువ రోజులు భరించాను. నా ఎనర్జీ లెవెల్స్‌ని తిరిగి పొందడం చాలా కష్టమైంది. గుర్రాన్ని ఎక్కడం, స్వారీ చేయడం చాలా పెద్ద పనిలా అనిపించింది. మన శరీరాలు మారవచ్చు కానీ, మన స్పిరిట్‌ని కనబరుస్తూనే ఉండాలి, ప్రతిరోజు నిరంతరంగా కృషి చేస్తూనే ఉండాలి. మనం దానిపై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఎలాంటి అపరాధన భావన అవసరం లేదన్నారు. తమ బిడ్డలకు ఉత్తమమైన వాటిని అందించాలనుకునే కొత్త తల్లులందరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు!'' అంటూ వరస ట్విట్లలో పేర్కొన్నారు. ఇదంతా తన ఇప్పటికే ఓకే చెప్పిన సినిమా కోసం ఫిట్ నెస్ ప్రారంభించినట్లు తెలిపారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed