సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బాహుబలి 2’ డిలిటెడ్ సీన్

by Anjali |
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బాహుబలి 2’ డిలిటెడ్ సీన్
X

దిశ, సినిమా: ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ అనగానే అభిమానులకు ‘ఛత్రపతి’ కంటే ముందు గుర్తుకు వచ్చే మూవీస్ బాహుబలి, బాహుబలి 2. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇమేజ్‌ను ప్రపంచస్థాయికి మార్చేశాయని చెప్పాలి. అయితే తాజాగా బయట పడిన విషయం ఏమిటంటే.. ‘బాహుబలి 2’ సినిమాలోని ఎన్నో ముఖ్యమైన సీన్లు నిడివి సమస్య వల్ల డిలీట్ చేశారట. తాజాగా ఆ డిలీటెడ్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సీన్స్ చూసిన నెటిజన్లు డిలీట్ చేసి మంచి పని చేశారంటున్నారు. ఈ సీన్ చూస్తే బాహుబలి ఫ్లిప్ కావడంతో పాటు గాయాల వల్ల బలమైన బండరాయి దగ్గర పడిపోయాడు. ఈ సీన్ సినిమాలో ఉండి ఉంటే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. అందుకే ఇది ముందుగానే గమనించిన జక్కన అవన్నీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story