మ‌రో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌తో అశ్విన్‌ బాబు.. 'శివం భజే' టీజర్ పై తాజా అప్డేట్

by Kavitha |
మ‌రో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌తో అశ్విన్‌ బాబు.. శివం భజే టీజర్ పై తాజా అప్డేట్
X

దిశ, సినిమా: ‘హిడింబా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ దిగాంగన సూర్యవంశీ కాంబోలో వస్తున్న మూవీ ‘శివం భజే’. ఈ సినిమాకి అప్సర్ దర్శకత్వం వహిస్తుండగా గంగా ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ రెడ్డి మూలీ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా రిలీజ్ అయిన అశ్విన్ లుక్ అదిరిపోయింది. ఉగ్ర రూపంలో ఉన్న అశ్విన్ ఓ వైపు శివస్మరణతో టైటిల్, బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర ఇలా అనౌన్స్ చేసిన ప్రతీ అప్డేట్‌కి పెరిగిపోతున్న అంచనాలు దృష్టిలో ఉంచుకుని నిర్మాత రేపు సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న చిత్రాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
Next Story

Most Viewed