టికెట్స్ బుక్ చేయమన్న సూర్య.. హనిమూన్‌కా అని అడిగిన ఆరోహి?

by Disha Web Desk 16 |
టికెట్స్ బుక్ చేయమన్న సూర్య.. హనిమూన్‌కా అని అడిగిన ఆరోహి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ 6th సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు ముగిసింది. ఈ సీజన్‌ బిగ్ బాస్‌లో ఆర్జే సూర్యకు ఆరోహికి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వీరి ప్రతీ ఫుటేజ్ కవర్ అవుతోంది. అయితే ఆరోహికి సుదీప కంటే ఓట్లు తక్కువ రావడంతో ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్‌తో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు హౌస్‌లో ఎవరికి తినిపించలేదు శ్రీహాన్ ఒక్కరికే తినిపించా.. అంత మంచోడు అంటూ పొగడటంతో శ్రీహాన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఆర్జే సూర్య ఆరోహి ఎలినేషన్ కావటంతో బాధలో ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అయితే వెళ్ళాక టికెట్స్ బుక్ చెయ్ అన్నాడు సూర్య. దీంతో అందరూ ఆశ్చర్యంగా చూడటంతో.. ఆరోహి మీరు అనుకుంటున్నట్లుగా హనిమూన్‌కు కాదు.. మేము అంతా కేరళ వెళ్దాం అనుకున్నాం దాని గురించి అని క్లారిటీ ఇచ్చింది ఆరోహి. అందరి పాజిటివ్ రివ్వూ చెప్పి సేఫ్‌గా బయటపడింది.


Next Story

Most Viewed