- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అర్జున్ రెడ్డి బ్యూటీ వీడియో.. ఏమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో షాలిన పాండే ఒకరు. ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ షాక్‌కి గురి చేసింది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్‌కి వరుస ఆఫర్లు రావడంతో కెరీర్ మారిపోయింది. కానీ షాలినికి మాత్రం అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసింది.
అక్కడ పలు చిత్రాల్లో నటించాక ఆఫర్లు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ జిమ్ వర్కౌట్స్ షేర్ చేస్తూ ఉంది. అయితే ఇటీవల షాలిని ఓ ఈవెంట్‌లో పాల్గొన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో బక్కచిక్కి పోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో అది చూసిన వారంతా షాక్ అవుతూ ఎంతో అందంగా కనిపించే ఆమెకు .. సడెన్‌గా ఏమైందని ఆందోళన చెందుతున్నారు.