- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సదా మీద అరిచేసిన ఆరియానా..వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వదు
దిశ, సినిమా: స్టార్ మా లో ‘నీతోనే డాన్స్ 2.0’ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సదా, రాధిక జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీవారం లాగే ఈ వారం కూడా ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో భాగంగా మానస్- సుబ్బు జోడీలో సుబ్బుకి హెల్త్ బాలేని కారణంగా మానస్ ఒక్కడే షో కి వచ్చాడు. ఐతే మరి జోడీ ఎవరు నీకు అని శ్రీముఖి అనేలోపు వెనక నుంచి భానుశ్రీ ఎంట్రీ ఇచ్చింది. "అబ్బాయి అబ్బాయి డాన్స్ చేయకూడదు..అబ్బాయి అమ్మాయి డాన్స్ చేయాలి" అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. అలాగే అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ ఈ షో లో కనిపించారు.
ఐతే ఈ వారం ఎపిసోడ్ లో రెండు జంటల మధ్య గట్టిగా యుద్ధం జరుగబోతుందన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. అవినాష్ - అరియానా, విశ్వా-నయని పావని జంటల మధ్య మార్కులు విషయంలో ఒకరికి పోటీగా మరొకరు తక్కువ మార్కులు ఇచ్చుకుని అరుచుకున్నారు.
ఇక విశ్వా - నయని పావని డాన్స్ కి ఆరియానా చాలా తక్కువ మార్కులు ఇచ్చేసరికి సదా మధ్యలో వచ్చి ఆరియానా మీద అరిచేసింది. ఆరియానా కూడా జడ్జెస్ అలా అరవకూడదంటూ రివర్స్ కౌంటర్ వేసింది. ఐతే జడ్జి సదాకి ఈ డాన్స్ షో లో బ్రిట్టో, విశ్వా, నేహా చౌదరి, యావర్ అంటే విపరీతమైన ఇష్టం..వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వదు. అని అరియనా గట్టిగా అన్న మాటలకు సదా అహం దెబ్బతిని షో నుంచి లేచి వెళ్ళిపోయింది.