అనుష్క నటిస్తోన్న బ్లాక్ బస్టర్ సినిమాకు టైటిల్ ఖరారు!!

by Disha Web Desk 9 |
అనుష్క నటిస్తోన్న బ్లాక్ బస్టర్ సినిమాకు టైటిల్ ఖరారు!!
X

దిశ, సినిమా: అప్పట్లో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. శౌర్యం, పంచాక్షరి, బలాదూర్, లక్ష్యం, చింతకాయల రవి, ఓం నమో వెంకటేశాయ, డమరుకం, ఖలేజా, విక్రమార్కుడు, రుద్రమదేవి, మిర్చి, బిల్లా వంట చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘బాహుబలి’ చిత్రంలో నటించి.. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టిన సినిమాల్లో బాహుబలి ఒకటి. ఈ సినిమా తర్వాత అనుష్క పెద్దగా సినిమాల్లో నటించలేదు.

అనుష్క శెట్టి బరువు పెరగడం వల్ల సినిమాలకు దూరమైందని సోషల్ మీడియా టాక్. రీసెంట్‌గా ఈ బ్యూటీ ‘మిస్‌‌‌‌‌‌‌‌ శెట్టి మిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొలిశెట్టి’ సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన నటించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ కామన్ అమ్మాయిగా ఈ హీరోయిన్ కనిపించనుందని టాక్.

ఒడిశాలోని ఒక లేడీ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఒడిశాలోనే జరుగుందట. అయితే తాజాగా ఈ మూవీకి ‘శీలవతి’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ స్టోరీ అని తెలుస్తోంది. అనుష్క శెట్టి ఈ మూవీతో పాటు మలయాళంలో ‘కథనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే సినిమాలో నటిస్తుంది.

Next Story