- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందు తాగుతూ రెచ్చిపోయిన అనుపమ.. టిల్లు మొత్తం మార్చేశాడుగా ! (వీడియో)

దిశ, సినిమా: కేరళ కుట్టి అనుపమకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ‘అఆ’, ‘శతమానం భవతి’,‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘కార్తికేయ2’ వంటి సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ చిన్నది, గ్లామర్ షోకు దూరంగా ఉంటూ యూత్ ఫేవరేట్ క్రష్ గా ఫస్ట్ ప్లేస్ సంపాదించుకుంది. కానీ ఇంతలోనే ఈ బ్యూటీ.. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో లిప్ లాక్ సీన్స్‌లో నటించి షాక్ ఇచ్చింది. ఇక ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్న అనుపమ అంతకంత పెద్ద షాక్ ఇచ్చింది. మొదటి నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలలో ఈ మలయాళీ బ్యూటీ కొత్తగా కనిపించింది. ట్రైలర్ లో ఊహించని లుక్ లో కనిపించి లిప్ లాక్ కిస్ లు, అందాల ఆరబోతతో.. గ్లామర్ డోస్ పెంచేసింది. దీంతో కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు.
ఇందులో భాగంగా అనుపమ తాజాగా ఓ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఈ వీడియోలో మరింత గ్లామర్ డోస్ పెంచింది అనుపమ. ప్రజంట్ ఈ వీడియో తెగ వైరల్ అవుతుండటంతో.. ‘టిల్లు గాడు మొత్తం మార్చేశాడు.. బేబీ కొంచెం పద్ధతిగా ఉండు’ అంటూ ‘ఇంతగా మారిపోవడం చూస్తుంటే బ్రేకప్ కంటే ఇది ఎక్కువ బాధిస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అనుపమ డై హార్డ్ ఫ్యాన్స్.