చీరలో అనుపమ కిల్లింగ్ లుక్స్.. చందమామ భూమిపైకి వచ్చేసిందంటూ నెటిజన్ల ప్రశంసలు

by Hamsa |
చీరలో అనుపమ కిల్లింగ్ లుక్స్.. చందమామ భూమిపైకి వచ్చేసిందంటూ నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల అను ‘టిల్లు స్క్వేర్’ మూవీలో బోల్డ్ సీన్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ మూవీ మార్చి 29న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు బైసన్, పరదా, పెట్ డిటెక్టివ్ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే పలు షాపింగ్ మాల్స్ ప్రారంభిస్తూ సందడి చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన ఫొటోలు వదులుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. తాజాగా, అనుపమ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ చీరకట్టుకుని చామంతి పువ్వులు పెట్టుకుని కిల్లింగ్ లుక్స్‌తో అందరి మనసులు దోచేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన వారు కొందరు చందమామ భూమిపైకి వచ్చిందని కామెంట్లు పెడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఒక్క పోస్ట్‌తో ప్రేమలో పడేస్తున్నావని అంటున్నారు.

Next Story

Most Viewed