రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి లావణ్యపై కేసు పెట్టిన హీరోయిన్!

by Hamsa |
రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి లావణ్యపై కేసు పెట్టిన హీరోయిన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేసినట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తనను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్‌లో ఉంటున్నట్లు చేసిన కామెంట్లు దుమారం రేపిన విషయం తెలిసిందే. అలాగే లావణ్య రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. దీంతో ఈ యంగ్ హీరో స్పందించి ప్రేమించుకుంది నిజమే కానీ ఆమె మరో అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసి దూరం అయ్యానని చెప్పాడు. కానీ లావణ్య మాత్రం రాజ్‌కు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉన్నట్లు చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. అలాగే మాల్వికి వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఈ యంగ్ బ్యూటీ, లావణ్య పై కేసు నమోదు చేసింది. తన ఫ్యామిలీని టార్చర్ చేస్తుందని చెప్పింది. అంతా సద్దుమనిగింది అనుకుంటున్న క్రమంలో.. రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. తాజాగా, మరోసారి మాల్వీ మల్హోత్రా, లావణ్యపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో.. తన సోదరుడికి అనుచిత మేసేజ్‌లు పంపుతూ.. తనపై కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఫిలింనగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మాల్వి, రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామి’. ఈ మూవీ జూలై 19న రిలీజ్ కానుంది. కానీ ప్రమోషన్స్ చేయకుండా మాల్వీ, రాజ్ కేసుల చుట్టూ తిరుగుతుండటంతో.. అంతా అయోమయంలో పడిపోయారు.

Next Story

Most Viewed