ఇండస్ట్రీలో మరో విషాదం.. దుల్కర్ సల్మాన్‌ హీరోయిన్ గుండెపోటుతో మృతి

by sudharani |
ఇండస్ట్రీలో మరో విషాదం.. దుల్కర్ సల్మాన్‌ హీరోయిన్ గుండెపోటుతో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో గుండె పోటుతో చాలా మంది మృతి చెందుతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ ఉన్న వ్యక్తులు కూడా గుండెపోటు రావడంతో మృత్యువాత పడుతున్నారు. అదే విధంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా గుండె పోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ హాట్ ఎటాక్‌తో మృతి చెందడం సెన్సేషన్‌గా మారింది.

మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లక్ష్మీకా సజీవన్ (27) గుండెపోటుతో మరణించారు. గత ఆమెకు గుండె పోటు రాగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మీకా.. మొదటి షార్ట్ ఫిల్మ్‌మ్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత.. పంచవర్ణతతా, సౌదీ వెల్లక్క, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయకన్‌తో పాటు దుల్కర్ సల్మాన్‌తో ‘ఒరు యమందన్’ వంటి సినిమాల్లో నటించి అలరించింది. కాగా.. చిన్న వయసులోనే చనిపోయిన లక్ష్మీకా సజీవన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.Next Story

Most Viewed