లావణ్య-వరుణ్ బాటలో మరో టాలీవుడ్ స్టార్ హీరో!

by Disha Web Desk 9 |
లావణ్య-వరుణ్ బాటలో మరో టాలీవుడ్ స్టార్ హీరో!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ముగిశాయి. అనంతరం హైదరాబాదుకు చేరుకుని టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించి.. గ్రాండ్‌గా రిసెప్షన్ జరుపుకున్నారు. పెళ్లై వారం దాటినా వరుణ్, లావణ్య పెళ్లి, రిసెప్షన్ పిక్స్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే లావణ్య, వరుణ్ బాటలో మరో జంట నడుస్తున్నారని.. ఇండస్ట్రీలో నెక్ట్స్ వీరి పెళ్లి హాట్ టాపిక్‌గా కానుందని ప్రస్తుతం నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వారేవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో రామ్, మలయాళీ క్రేజీ హీరోయిన్ అనుపమ. 2017లో తెరకెక్కిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో అనుపమ.. రామ్ సరసన నటించిన విషయం తెలిసిందే.

తర్వాత ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో కూడా జతకట్టారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, దీంతో రామ్, అనుపమ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లి ప్రకటన ఎప్పుడైనా రావచ్చని టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ రామ్, అనుమప గాఢమైన ప్రేమలో ఉన్నారని చాలా కాలం పుకార్లు వస్తున్నాయి.

Next Story