- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో స్టార్ యాక్టర్ రితురాజ్ సింగ్ మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో స్టార్ యాక్టర్ రితురాజ్ సింగ్ మృతి
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు రీతురాజ్ సింగ్ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 59 ఏళ్ల అతను గత కొంతకాలంగా.. ప్యాంక్రియాటిక్ సమస్యలతో ఆయన బాధ పడుతున్నట్లు తెలిసింది. ఇటీవల పలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి ఇంటికి వచ్చారు. నిన్న సాయంత్రం సమయంలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు..అతని సన్నిహిత మిత్రుడు అమిత్ బెహ్ల్ తెలిపారు.
కాగా అతను బాలీవుడ్‌లో దాదాపు 50 టీవీ సీరియళ్లలో నటించారు. అలాగే 11 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తునివులోను రితురాజ్ సింగ్ కీలక పాత్రలో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు. గుండెపోటుతో ఆయన మృతి చెందడంతో బాలీవుడ్ సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story