మెగా ఫ్యాన్స్‌కు మరో భారీ గుడ్ న్యూస్.. లక్ అంటే వీరిదేరా బాబు!

by Anjali |
మెగా ఫ్యాన్స్‌కు మరో భారీ గుడ్ న్యూస్.. లక్ అంటే వీరిదేరా బాబు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మెగా ఫ్యామిలీలో అన్ని శువార్తలే చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం మెగా ప్రిన్సెస్ క్లింకారనే కారణమంటూ మెగా అభిమానులు సోషల్ మీడిమా వేదికన హర్హం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన-రామ్ చరణ్ గారాల పట్టి మెగా ఇంట్లో అడుగుపెట్టగానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం జరిగింది. అనంతరం గ్లోబల్ స్టార్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. తర్వాత చరణ్ అమ్మ సరేఖ కిచెన్ అంటూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ముఖ్యంగా క్లింకార జన్మించిన రెండెళ్లకే రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు అవార్డులు సొంతం చేసుకున్నాడు. తాజాగా మెగా ఫ్యామిలీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దిల్ రాజు, బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. తండ్రి కొడుకు పాత్రలో నటించి జనాలకు ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. రామ్ చరణ్ అప్పన్న అనే పాత్రలో గ్రామీణ ప్రాంతంలో నివసించే వ్యక్తిగా పంచకట్టుతో చాలా నాచురల్ లుక్స్‌లో కనిపిస్తాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనుందని ఫ్యాన్స్ ఫుల్ హోప్‌తో ఉన్నారు. ఇదంతా క్లింకార పాదహస్తం అంటూ పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed