ఆయన బర్త్ డే స్పెషల్‌గా రాబోతున్న ‘Guntur Karam’ ఫస్ట్ సాంగ్

by Anjali |
ఆయన బర్త్ డే స్పెషల్‌గా రాబోతున్న ‘Guntur Karam’ ఫస్ట్ సాంగ్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. మహేష్ జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ అది జరగలేదు. తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న బజ్ ప్రకారం నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సాంగ్ లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.

ఇవి కూడా చదవండి : చిరంజీవి సినిమా ట్రైలర్ విడుదల.. నవ్వి నవ్వి చావాల్సిందే! (వీడియో)

Next Story