ప్రేక్షకుల ఫోకస్ ఆమెపైనే.. ఆ పాత్రల్లో నటించనంటున్న తృప్తి దిమ్రీ

by Disha Web Desk 6 |
ప్రేక్షకుల ఫోకస్ ఆమెపైనే.. ఆ పాత్రల్లో నటించనంటున్న తృప్తి దిమ్రీ
X

దిశ, సినిమా: రణ్‌బీర్ కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. ఇందులో దర్శకుడు సందీప్ వంగ చూపించిన పాత్రలకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించినప్పటికీ, ప్రేక్షకుల ఫోకస్ మాత్రం ఎక్కువగా జోయా పాత్రలో కనిపించిన హిందీ నటి తృప్తి దిమ్రీ మీదే పడింది. ఈ బ్యూటీ బాలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది. అయితే ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సౌత్‌‌లో మాత్రం ఇంకా ఏ సినిమాకూ కమిట్‌ అవ్వలేదు. కాగా ఇటీవల ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ‘సౌత్‌లో ఛాన్స్ వస్తే చేస్తారా?’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘సౌత్‌లో నటించేందుకు నాకు అభ్యంతరం లేదు. కాకపోతే చిన్నా చితక పాత్రలు, గెస్ట్‌ రోల్స్‌, ఐటం సాంగ్స్‌లో నటించేందుకు నేను రెడీగా లేను. మంచి పాత్రలు స్టార్‌ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది తృప్తి. దీంతో ఆమెకున్న టాలెంట్‌కు కాస్త వెయిట్‌ చేస్తే.. సౌత్‌‌లో స్టార్స్ నుంచి పిలుపు కచ్చింతంగా అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.Next Story