ఫేమస్ బాలీవుడ్ ఫ్రాంచైజీ మూవీ ‘భూల్ భులయ్యా 3 ’ లొ ఛాన్స్ కొట్టేసిన తృప్తి..

by Dishafeatures1 |
ఫేమస్ బాలీవుడ్ ఫ్రాంచైజీ మూవీ ‘భూల్ భులయ్యా 3 ’ లొ ఛాన్స్ కొట్టేసిన తృప్తి..
X

దిశ, సినిమా: తృప్తి డిమ్రి..ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. అప్పటి వరకు యాడ్స్ .. చిన్న చిన్న సినిమాలే చేస్తూ వచ్చిన తృప్తి ‘యానిమల్’ సినిమాతో చాలా పాపులర్ అయింది. ఆ మూవీలో గ్లామర్‌తో పాటు యాక్టింగ్‍‍తోనూ ఆకట్టుకున్నతృప్తి సిని ప్రియులకు సరికొత్త నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ చిన్నది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘భూల్ భులయ్యా 3’ మూవీలో హీరోయిన్ గా తృప్తి నటించనుంది. ఈ విషయాన్ని హీరో కార్తీక్ ఆర్యన్ ప్రకటించారు ‘మిస్టరీ గర్ల్’ అంటూ టీజ్ చేసిన ఆయన ఎట్టకేలకు తృప్తి పోస్టర్‌ను తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.

ప్రియదర్శన్ దర్శకత్వం లో 2007లో వచ్చిన ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం అంత చూసే ఉంటారు. విద్యాబాలన్ హీరోయిన్ గా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. ఇక కొనసాగింపుగా ‘భూల్ భులయ్యా 2’ కి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించగా కార్తీక్ ఆర్యన్ హీరోగా.. టబు, కియారా అడ్వానీ కీలక పాత్ర పొషించారు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు మూడో పార్ట్‌లో కియారా స్థానాన్ని తృప్తి డిమ్రి భర్తీ చేయగా, మంజులిక పాత్రలో విద్యాబాలన్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. కాగా టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాని ఈ ఏడాది (2024) దీపావళికి రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది.


Next Story