అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. నెట్టింట ఫొటోలు వైరల్

by Hamsa |   ( Updated:2024-02-24 07:58:37.0  )
అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన యానిమల్ సినిమాలో పలు బోల్డ్ సీన్స్‌లో నటించి సెన్సేషన్‌గా మారిపోయింది. ఇందులో జోయా పాత్రలో నటించి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవల మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఇక అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన పలు వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా, త్రిప్తి డిమ్రి ఓ బిజినెస్‌ మ్యాన్‌తో ప్రేమలో పడినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 23న త్రిప్తి పుట్టినరోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘నా ప్రియమైన తృప్తి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోను షేర్ చేయడంతో వీరి ప్రేమ విషయం తెరపైకి వచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు వీరిద్దరు ప్రేమించుకోవడం వల్లే అలా పిక్ తీసుకున్నారని చర్చించుకుంటున్నారు. దీంతో త్రిప్తి ఫ్యాన్స్ అసలు సామ్ మర్చంట్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఎంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.




Next Story

Most Viewed