ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.. మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ (వీడియో)

by Hamsa |
ఉప్పు, కారం తింటే నిజం రాయండంటూ.. మీడియాపై యాంకర్ అనసూయ ఫైర్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. సోషల్ మీడియాలో పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అనసూయ ఇటీవల తనను సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అని పిలిచిన వారిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, మీడియాపై ఫైర్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ వెబ్‌సైట్స్, యూట్మూబ్ చానల్స్ వాళ్ల మీద వార్తలు రాస్తూ పొట్ట నింపుకునే వారికి నేను ఒకటే చెప్తున్నాను. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఏడిపించారు. వెంటపడ్డారు ట్రోల్ చేశారని అని రాశారు. మీకు ఇంకా దునియా దారి తెలియదు అని చెప్తున్నా. పడ్డ వాడెప్పుడూ చెడ్డ వాడు కాదు. అన్న వాడి నోరే కంపు మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు, కారాలు తింటే నిజం రాయండి. నేను ధైర్యంగా నా అభిప్రాయం చెప్పాను. చేతకాని వాళ్లు అదుపుతప్పారు. ఇది మీరు రాయాల్సిన తబ్‌నెయిల్ నెక్ట్స్ టైమ్ మంచిగ రాయండి’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తూ మరోసారి ట్రోల్ చేస్తున్నారు.

Next Story