నెటిజన్లకు షాకిచ్చిన అనసూయ.. పోస్ట్ పెట్టడంతో బయటపడ్డ అసలు నిజం!

by Hamsa |
నెటిజన్లకు షాకిచ్చిన అనసూయ.. పోస్ట్ పెట్టడంతో బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ నటిగా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. వరుస సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 కీలక పాత్రలో నటించనుంది. అయితే గత కొద్ది కాలంగా బుల్లితెర దూరంగా ఉన్న అనసూయ.. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. పలు షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సినిమాలు కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా, అనసూయ ఇన్‌స్టా వేదికగా చిట్ చాట్ చేసి ఒక షాకిచ్చింది.

ఇందులో భాగంగా ఓ నెటిజన్ పవన్ కల్యాణ్‌తో కలిసి ఎప్పుడు నటిస్తారని అడిగాడు. దానికి అనసూయ రియాక్ట్ అవుతూ.. ‘‘ఆల్రెడీ ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర చేశాను. రీలీజ్ అవ్వాల్సి ఉంది’’ అని రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏ సినిమాలో నటించిందో చెప్పకపోవడంతో.. పవన్ నటిస్తున్న మూడు మూవీస్‌లో ఎందులో ఏ పాత్ర చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, పవర్ స్టార్ ప్రజెంట్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సుజిత్ డైరెక్షన్‌లో రాబోతుంది. అలాగే హరీష్ శంకర్, పవన్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్, క్రిష్‌తో హరి హర వీరమల్లు చేస్తున్నాడు. అయితే ఈ మూడు చిత్రాల్లో అనసూయ ఎందులో నటిస్తుందో తెలియాలంటే.. ఇవి విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story