- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యూ ఫొటోస్ షేర్ చేసిన అనసూయ.. ఈ చీరలు ఇంకెప్పుడూ కట్టొద్దంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: యాంకర్‌గా బుల్లితెరకు పరిచమైన అనసూయ.. తన అందంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ‘పుష్ప’, ‘విమానం’ వంటి చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ‘రజాకార్’ చిత్రంతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. నిజాం నిరంకుశ పాలన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో అనసూయ కనిపించనుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం కూడా హిట్ అయితే.. అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోతుంది.
‘రజాకార్’ చిత్రం మార్చి 1న తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో బ్లూ కరల్ చీరలో చాలా సాంప్రదాయంగా కనిపించింది అనసూయ. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇంత అందం తట్టుకోలేపోతున్నాం.. ఇంకెప్పుడూ ఈ చీరలు కట్టుకోకు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.