The Shameless: చరిత్ర సృష్టించిన అనసూయ.. ఆ అవార్డు గెలిచిన తొలి భారతీయ నటిగా రికార్డు!

by Javid Pasha |
The Shameless: చరిత్ర సృష్టించిన అనసూయ.. ఆ అవార్డు గెలిచిన తొలి భారతీయ నటిగా రికార్డు!
X

దిశ, సినిమా : నటి అనసూయా సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా 'Un Certain Regard Prize' అందుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. 'The Shameless' సినిమాకు గాను ఈ అవార్డు అందుకున్న ఆమె.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఈ చిత్రానికి బల్గేరియన్ ఫిల్మ్ మేకర్ కన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకులు కాగా .. పోలీస్ అధికారిని చంపి బ్రోతల్ హౌస్ నుంచి ఎస్కేప్ అయిన రేణుక పాత్రలో కనిపించింది అనసూయ. ఇక ఈమె లవర్ పాత్రలో ఒమన్ శెట్టి నటించడం విశేషం.

కాగా తమ సినిమా కేన్స్ Un Certain Regard సెక్షన్ కు సెలెక్ట్ అయిందని డైరెక్టర్ చెప్పగానే ఎగిరిగంతేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక అనసూయ కాకుండా ఇండియాకు సంబంధించిన రెండు షార్ట్ ఫిల్మ్స్ 'Sunflowers', 'Bunnyhood'.. ఈ ఏడాది Cannes La Cinef సెక్షన్ లో ఫస్ట్, థర్డ్ ప్లేస్ లో నిలవడం విశేషం.

Next Story