అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ!

by Anjali |
అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ!
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు నెట్టింట ఆరబోసే అందాలకు నెటిజన్లు కాస్త వెటకారంగా కామెంట్లు చేస్తే మాత్రం వెంటనే ఇచ్చిపడేస్తుంది.

సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాలో సునిల్ భార్యగా దాక్షాయణి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పుష్ప-2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇక ఈ భామ ప్రేమ విమానం, విమానం, మైఖెల్, రంగమార్తాండా, గాడ్ ఫాదర్, వాంటెడ్ పండుగాడ్, దర్జా మూవీల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

‘‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ మూవీలో ఒక సాంగ్‌లో నటించాలని త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ రిజెక్ట్ చేశాను. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2 లో నాకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ నేను నటించబోనని చెప్పాను. దీంతో నా ప్లేస్‌లో శ్రద్ధాదాస్‌ను తీసుకున్నారు. ఆ సమయంలో నేను నా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను.’’ అని హాట్ యాంకర్ అనసూయ చెప్పుకొచ్చింది.Next Story

Most Viewed