ఆడపిల్లను కనాలని ఉంది.. కానీ మా ఆయన సహకరించడం లేదు: వైరలవుతోన్న అనసూయ బోల్డ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
ఆడపిల్లను కనాలని ఉంది.. కానీ మా ఆయన సహకరించడం లేదు: వైరలవుతోన్న అనసూయ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. వెండితెరపై హంగామా చేస్తోంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్.. పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. అనసూయకు ఫ్రీ టైం దొరికినప్పుడు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటుంది. కాగా అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను వైన్‌ తాగుతానని ఓపెన్‌ అయిన విషయం తెలిసిందే. అందులో తప్పేముందని కూడా చెప్పుకొచ్చింది. తాజాగా హాజరైన ఓ ఇంటర్వ్యూలో ఈ హాట్ యాంకర్ చేసిన కామెంట్లకు నెటిజన్లు నోటి మీద వేలేసుకుంటున్నారు. ‘‘మా అత్తగారిది బీహార్‌. అక్కడ సంప్రదాయాలు ఎక్కువ. పది మందిలో ఉన్నప్పుడు కొంగు తలపై కొంగు కప్పుకుని ఉండాలి. అక్కడ అమ్మాయిలు రంగురంగులుగా ఉంటారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం.

నాకు ఆడపిల్లను కనాలని ఉందని రీసెంట్‌గా నా అత్తగారికి ఓపెన్‌గా సిగ్గు విడిచి చెప్పాను. ఈ మాట చెప్పగానే మా అత్తగారు నాపై కోప్పడ్డారు. ఇందుకు బిహార్‌లోకి కట్టుబాట్లే కారణం. అక్కడ మగవాళ్ల డామినేషన్‌ ఉంటుంది. నా పిల్లలకు కూడా చెల్లిని ఇస్తా అంటే నా చిన్న కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మాయిని కంటారా అని లాస్ట్‌లో యాంకర్‌ ప్రశ్నించగా.. నాకు కనాలనే ఉంది.. కానీ నా భర్త సహకరించడం లేదు. ఆడపిల్ల ఉన్న ఇల్లు ప్రశాంతంగా, అణకువగా ఉంటుందని సిగ్గువిడిచి బోల్డ్ గా చెప్పుకొచ్చింది హాట్ యాంకర్. ప్రస్తుతం అనసూయ కామెంట్లు విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed