అనసూయ చిన్ననాటి ఫొటో వైరల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

by Disha Web Desk 9 |
అనసూయ చిన్ననాటి ఫొటో వైరల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ నెట్టింట ఆరబోసే అందాలకు కుర్రాళ్ల నుంచి అంకుల్స్‌కు సైతం నిద్రపట్టదంటే అతిశయోక్తి కాదు. అనసూయ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే.. లక్షల్లో లైకులు రావాల్సిందే. అంతటి హాట్ ఫొటో షూట్‌తో ఈ భామ యూత్‌ను ఉక్కిరిబిక్కిరిచేస్తుంది మరీ. తాజాగా అనసూయ.. తన చిన్ననాటి ఫోటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ క్యూట్ ఫొటోను వీక్షించిన.. అభిమానులు.. ‘వావ్, క్యూట్, అప్పుడు ఇప్పుడు ఆ అందానికి మరకే లేదు. అనసూయ మేడమ్ ఎప్పుడైనా బ్యూటీఫుల్’ అంటూ ఫొటోలో ఉన్న బుజ్జాయిని పొగిడేస్తూ నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ప్రస్తుతం అనసూయ చిన్ననాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమాల విషయానికొస్తే..

అనసూయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి.. ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ కు సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ‘విమానం, భీష్మ పర్వం, ప్రేమ విమానం లాంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించి ఆడియన్స్‌ను మెప్పించింది.

Next Story

Most Viewed