త్రివిక్రమ్‌కు క్షమాపణ చెప్పిన అనసూయ..

by sudharani |
త్రివిక్రమ్‌కు క్షమాపణ చెప్పిన అనసూయ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుస సినిమాలతో అలరిస్తుంది అనసూయ. ప్రజంట్ బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ.. కొన్ని విషయాలు పంచుకుంది. ‘‘అత్తారింటికి దారేది’ సినిమాలో నాకు ఒక పాటలో అవకాశం వచ్చింది. అందులో ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని నేను చేయనని చెప్పాను. ఎందుకంటే గుంపులో ఒకరిగా నటించడం నాకు నచ్చదు. నాకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటాను. అందుకే ఆ పాటకు నో చెప్పా. కానీ ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు చాలా మంది నన్ను విమర్శించారు.

ఎందుకంటే నేను నో చెప్పడం తప్పు కాదు.. నో చెప్పే విధానం తప్పు అన్నారు. మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని.. అందుకే కొంచెం కఠినంగా చెప్పాను. ఇక విషయం లీక్ అవ్వడంతో ఆ పాటలో నటించనందుకు ట్విట్టర్‌లో పెద్ద వార్ జరిగింది. దీంతో వెంటనే త్రివిక్రమ్‌కు సారీ చెప్పాను’ అని తెలిపింది. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో సమంత, ప్రణితా సుభాష్ హీరోయిన్లుగా నటించగా.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఏ పాటకు అనసూయను ఎంచుకుని ఉంటారు అనే చర్చ ప్రజెంట్ సోషల్ మీడియాలో జరుగుతుంది.Next Story

Most Viewed