కోకా 2.0 లో దుమ్ము లేపిన అనన్య, విజయ్.. ఫ్యాన్స్ ఫిదా

by Disha Web |
కోకా 2.0 లో దుమ్ము లేపిన అనన్య, విజయ్.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో లైగర్ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్న పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా అనన్య, విజయ్ పలు ప్రదేశాల్లో షికార్లు కొడుతున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్. కోకా 2.0 సాంగ్‌ను విడుదల చేశారు. మాస్ స్టెప్పులతో విజయ్, అనన్య పాండే డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. నెట్టింట పాటను చూసిన నెటిజన్లు 'సూపర్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్.. పక్కింటి వ్యక్తి వీడియోలపై సీరియస్..


Next Story